మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (09:01 IST)

#HappyNewYear2018 : ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా... ఆడి పేరేందిరా బై..???

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ భేటీ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రగతి భవన్‌కు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ భేటీ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లి పవన్.. సీఎం కేసీఆర్‌కు అర్థగంటపాటు ఏకాంత చర్చలు జరిపారు. అంతేనా, ప్రగతి భవన్‌లో ఏకంగా రెండు గంటలకు పైగా ఉన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
నిజానికి ఈ భేటీ వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? పైకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపినప్పటికీ.. ఈ భేటీ వెనుక ప్రధాన కారణం ఏదో ఉండే ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే వర్మ మాత్రం మరోసారి ఈ భేటీని హైలెట్ చేస్తూ.. వారి పాత చరిత్రలను తిరగేసి మరోసారి నేను వర్మని అంటూ నిరూపించుకున్నారు. 
 
హీరో పవన్ కల్యాణ్ గతంలో ఓ వేదికపై ప్రసంగిస్తూ.. అన్నమాటలని, అలాగే పవన్‌పై కేసీఆర్ ఓ బహిరంగ సభలో పేల్చిన పంచులను గుర్తు చేస్తూ.. రాజకీయ నాయకుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో మరోసారి తన పోస్ట్‌లో తెలిపారు.
 
ఇంతకీ వర్మ ఏం పోస్ట్ చేశారంటే..
పవన్ కల్యాణ్: ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా..!!!
కేసీఆర్: ఆడి పేరేందిరా బై.. ???
అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చేస్తుంది. జై రాజకీయ నాయకుల్లారా! అంటూ కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోని పోస్ట్ చేశారు.