ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2024 (18:02 IST)

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Vijay Polaki Master
Vijay Polaki Master
''పుష్ప 2 టైటిల్ సాంగ్, జాతర పాటకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ కోరియోగ్రఫర్ గా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. పుష్ప 2 టైటిల్ సాంగ్, జాతర పాట నా కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది'అన్నారు స్టార్ కొరియోగ్రఫర్ విజయ్ పోలాకి మాస్టర్. రీసెంట్ గా ఆయన కొరియోగ్రఫీ చేసిన పుష్ప 2 టైటిల్ సాంగ్, జాతర పాటలు టాప్ ట్రెండింగ్ లో నిలిచిన నేపధ్యంలో విలేకరులు సమావేశంలో తన జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు విజయ్ పోలాకి మాస్టర్.  
 
ఈ మధ్య ట్విట్టర్ లో ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ అని వైరల్ అయ్యారు. ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
-చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా భాద్యతగా ఫీలౌతున్నాను, ఏ సాంగ్ వచ్చిన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.  
 
మీ జర్నీ గురించి చెప్పండి?  
-డ్యాన్సర్ గా ఉన్నప్పటి నుంచే కొరియోగ్రఫీ అవకాశాలు కోసం తిరిగాను. నేను కోరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్ 'కొబ్బరిమట్ట' సినిమాలోని అఆ ఇఈ. తర్వాత పలాసలో అన్ని పాటలు చేశాను. అందులో నిక్కిలీసు గొలుసు పాట వైరల్ హిట్ అయ్యింది. తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ గారి 'పుష్ప' సినిమా అవకాశం వచ్చింది. సుకుమార్ గారు, బన్నీ గారి దగ్గరికి నా ప్రొఫైల్ వెళ్ళింది. నా డెమోస్ చూసి పిలిచారు. 'ఊ అంటావా మామ' సాంగ్ ని కొరియోగ్రఫీ చేసి పంపించాను. వారి మేనజర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత బన్నీ గారి స్టూడియోకి వెళ్లాను. అక్కడే రిహార్సల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటికే వారు గణేష్ ఆచార్య మాస్టర్ అని ఫిక్స్ అయ్యారు, అయినప్పటికీ ఆ మాస్టర్ ని కన్వెన్స్ చేసినా నన్ను కూడా ఒక మాస్టర్ గా ఇంక్లూడ్ చేశారు. అక్కడ నుంచి నేను వెనక్కి తిరిగిచూసుకోలేదు.
 
-పుష్ప 2 కోసం సుకుమార్ గారి నుంచి కాల్ వచ్చింది. అసలు ఇది నేను ఊహించలేదు. సుకుమార్ గారు జాతర సాంగ్ వినిపించారు. మొదట ఒక బిట్ సాంగ్ లా చేద్దామని అనుకున్నారు. నేను ఫుల్ సాంగ్ కొరియోగ్రఫి చేసిన తర్వాత 'అదిరిపోయింది మాస్టర్ ఇలానే వెళ్దాం' అన్నారు. ఆ సాంగ్ నచ్చిన తర్వాత పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ కూడా బన్నీ గారు సుకుమార్ గారు నాకు అవకాశం ఇచ్చారు.
ఏం  చేసిన పుష్ప క్యారెక్టర్ నుంచే రావాలని సుకుమార్ గారు చెప్పారు.
 
-సుకుమార్ గారి విజన్ కి తగ్గట్టుగానే చాయ్ గ్లాస్ స్టెప్, ఫోన్ స్టెప్, ఫైర్ సిగరెట్ స్టెప్.. ఇవన్నీ పుష్ప క్యారెక్టరైజేషన్ నుంచే కంపోజ్ చేయడం జరిగింది. గంగమ్మ తల్లి జాతర సాంగ్ నుంచి ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఆ క్యారెక్టర్ లో లీనమైపోయాను. క్యారెక్టర్ నుంచి లీడ్ కోసం దాదాపు ఎనిమిదిసార్లు పుష్ప సినిమా చూశాను. టీ మూమెంట్ చూసిన తర్వాత బన్నీ గారు అదిరిపోయింది మాస్టర్ అని చెప్పారు. ప్రతిది పుష్ప క్యారెక్టర్ నుంచే తీసుకున్నాం.
 
జాతర సాంగ్ గురించి చెప్పండి?
-నా చిన్నప్పుడు ఊర్లో జాతర ఎలా జరుగుతుందో చాలా నిశితంగా గమనించే వాడిని. తలపై కుండపెట్టుకొని నడుస్తున్నపుడు కాళ్ళని పసుపు నీటితో అడుగుతారు, కొందరు నేలపై చీరలు, పైట పరుస్తారు. జాతర సాంగ్ లీడ్ ని సుకుమార్ గారు చెప్పినప్పుడు చాలా ఎమోషన్ అయ్యాను. చీర మూమెంట్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సాంగ్ కి మూడు నెలలు ప్రిపేర్ అయ్యి, 20 రోజులు షూట్ చేశాం. సినిమా చూసిన తర్వాత అందరూ జాతర సాంగ్ గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బన్నీ గారు అద్భుతమైన పెర్ఫార్మార్. మేము 90 శాతం చేస్తే బన్నీ గారు వందకి వంద శాతం ఇచ్చారు. సుకుమార్ గారు రెగ్యులర్ గా కాకుండా ఒక పూనకం వస్తే ఎలా ఉండాలో అలా చేయాలని ముందే చెప్పారు. ఆయన స్వయంగా కొన్ని చేసి చూపించారు.    
 
ఇప్పటివరకూ మీరు చేసిన సాంగ్స్ లో ఛాలెంజింగా అనిపించిన పాట ?
-నేను ప్రతి సాంగ్ ఛాలెంజ్ గా తీసుకునే చేస్తాను. చేసిన ప్రతి సాంగ్ కి బెస్ట్ ఇవ్వాలని ఫీలౌతాను.
 
మీకు డ్యాన్స్ పై ఎప్పుడు ఆసక్తి కలిగింది ?
-నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని. ఇంద్ర సినిమాని కేవలం దాయి దాయి దామ్మ వీణ స్టెప్ కోసమే 22 సార్లు చూశాను. ఇంట్లో అమ్మనాన్నలకి కూడా చింజీవి గారు ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎజాజ్ మాస్టర్ పరిచయమయ్యారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను. స్వర్ణ మాస్టర్ స్టూడియోలో నేర్చుకున్నాను.
 
-మాస్టర్ అవ్వాలనే ఆలోచన హీరో రామ్ పోతినేని గారి వలనే వచ్చింది. నా వీడియోస్ చూసి డెమోస్ చేసి చూపించమన్నారు. నా డెమోస్ చూసి కార్డ్ ఉందా అని అడిగారు. నేనూ కార్డ్ తీసుకోవచ్చు నేనూ మాస్టర్ కావచ్చనే ఆలోచన ఆయన వలననే మొదలైయింది. 2015లో డ్యాన్సర్ కార్డ్ తీసుకున్నాను. డ్యాన్సర్ గా చేశాను. తర్వాత మాస్టర్ అయ్యాను.  
 
మీ స్ట్రెంత్ ఏమిటి ?
-నేను అన్ని రకాల పాటలు చేస్తాను. బేబీలో గణేష్ దగ్గర చేసిన మాస్ బిట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లింగిడి లింగిడి, కళ్ళ జోడు కాలేజ్ పాప, బేబీ జిలేబి, రవితేజ గారి గల్లంతే, హాయ్ నాన్నలో అమ్మాడి, రామ్ గారి మార్ ముంత చోడ్ చింత, పుష్ప పుష్ప, జాతర సాంగ్, నా సామిరంగలో దుమ్ము దుకాణం, క మూవీలో మాస్ జాతర, గం గణేశా లో అల్లల్లె .. ఇలా ఈ రెండేళ్ళలో నేను కొరియోగ్రఫి చేసిన సూపర్ హిట్స్ చాలా తృప్తిని ఇచ్చాయి.    
 
డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా ?
లేదు. కోరియోగ్రఫీలోనే ఇంకా పేరు తెచ్చుకోవాలని వుంది. ఫ్యూచర్ లో చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు.. అందరితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. వాల్తేరు వీరయ్యలో రవితేజ గారి ఎంట్రీలో ఫైట్ మాస్టర్ తో కలసి ఓ బిట్ చేశాను.  
 
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?
-సాయి ధరమ్ తేజ్ గారి సంబరాల ఏటిగట్టు, రామ్ గారి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ గారి భైరవం, మ్యాడ్ 2 కి సింగిల్ కార్డ్ చేస్తున్నాను. హిందీలో బేబీ చేస్తున్నాను.