రకుల్ ప్రీత్ సింగ్ వద్దు.. రాశిఖన్నానే ముద్దన్న రామ్!
'నేను శైలజ' సినిమాకు తర్వాత కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేసేందుకు రామ్ సిద్ధపడ్డాడు. కచ్చితంగా కమర్షియల్ మసాలా సినిమాను చేయాలని రామ్ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే ఈ మూవీ కోసం ముందు తమన్నా కానీ.. లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్‌ను అనుకున్నారట. అయితే బడ్జెట్ పరంగా రకుల్ ప్రీత్ సింగ్‌ను పక్కనబెట్టి.. మినిమం బడ్జెట్ హీరోయిన్ రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.
టాప్ రేంజుకు వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ కోటి అడగటం.. ఫ్లాపులు తప్ప భారీ హిట్లే లేని తమన్నా కూడా దాదాపు అంతే అడగటంతో.. రామ్ షాకు తిన్నాడట. అందుకే రామ్ రాశినే చాలునని డిసైడ్ అయ్యాడట. రాశిఖన్నాకు రూ.30 లక్షలిచ్చి.. హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొచ్చాయి.