శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (15:26 IST)

హను-మాన్‌ లో కోటి పాత్రకు వాయిస్ ఇచ్చిన హీరో రవితేజ

Ravitej dubbing
Ravitej dubbing
హనుమంతుడిని వానర రూపంలో కొలుస్తారు. హిందువులు, వానరములను దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 'హను-మాన్‌'లో వానరం యొక్క ప్రత్యేక పాత్ర ఉంది. 'హను-మాన్‌'లో వానరం పేరు కోటి, అది సినిమా అంతటా ఉంటుంది.
 
ఈ కీలక పాత్రకు మాస్ మహారాజా రవితేజ తన వాయిస్ ని అందించారు. కోటి పాత్రకు రవితేజ డబ్బింగ్ చెప్పారు. సాధారణంగా, వానరములు వాటి చంచలమైన స్వభావం, చమత్కారమైన చర్యలు, అత్యంత శక్తికి ప్రసిద్ధి చెందాయి. రవితేజ వాయిస్‌తో పాత్ర మరింత హ్యూమర్స్, ఎనర్జిటిక్‌గా ఉండబోతోంది.
 
తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రవితేజ సపోర్ట్‌ బిగ్ బెనిఫిట్. నిజానికి చిన్న, మీడియం రేంజ్ సినిమాల‌కు స‌పోర్ట్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు రవితేజ. మాస్ మహారాజా రవితేజ సపోర్ట్ కు హను-మాన్ టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
 
అఖండ భారత్‌లోని ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన హను-మాన్ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం. అంజనాద్రి అనే ఫాంటసీ లోకం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా, వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించగా, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల.
 
హను-మాన్ జనవరి 12న సంక్రాంతికి తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్,  జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.