శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (16:50 IST)

ఆర్టిస్టుగా చేయ‌డానికి రెడీ - అల్లు అర‌వింద్‌

Allu Arvind
అల్లు రామ‌లింగ‌య్య వార‌సుడిగా సినిమారంగంలో ప్ర‌వేశించిన అల్లు అర‌వింద్ మొద‌ట‌నుంచి నిర్మాణ రంగంలోనూ బిజినెస్ విష‌యాలలోనూ మంచి అవ‌గాహ‌న వుంది. ఆ త‌ర్వాత మ‌ధ్య‌లో చిన్న చిన్న పాత్ర‌లు కూడా త‌మ సినిమాల‌లో చేశాడు. చిరంజీవి `చంట‌బ్బాయ్‌` సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ పాత్ర చేసి మెప్పించాడు. ఆ త‌ర్వాత మ‌ర‌లా పెద్ద‌గా ప్ర‌య‌త్నం చేయ‌లేదు. 
 
క్ర‌మేణా త‌న వార‌సులు అల్లు అర్జున్ హీరోగా మారాడు. ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ప‌లువురు హీరోలుగా వ‌చ్చారు. వారంద‌రినీ ప్ర‌ణాళిక‌గా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తూ వుండేవారు. మ‌రోవైపు  సినిమా మార్కెటింగ్‌, పంపిణీ వ్య‌వ‌స్థ‌, థియేట‌ర్లు, ఓటీటీ వంటి ప‌లు ప్రాజెక్ట్‌ల‌పై బిజీ అయ్యారు. వ‌య‌స్సు పెరిగే కొద్దీ ఆ బాధ్య‌త‌ల‌ను త‌న వార‌సులు అల్లు శిరీష్‌, అల్లు బాబీతోపాటు ప‌లువురికి అప్ప‌గించారు. తాజాగా గ‌ని సినిమా వ‌రున్‌తేజ్‌తో తీశారు. చిత్ర ప్రమోష‌న్‌లో భాగంగా ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెబుతూ, ఇక‌నుంచి సినిమాల్లో కేరెక్ట‌ర్ చేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. వెంట‌నే గ‌ని ద‌ర్శ‌కుడు చేస్తానంటే నేను రాస్తానంటూ స‌మాధాన‌మిచ్చాడు. సో.. ఇక‌నుంచి ఆయ‌న బేన‌ర్‌లో వ‌చ్చే సినిమాల్లో ద‌ర్శ‌కులు ఏదో పాత్ర ఇస్తార‌ని అర్థ‌మ‌యింది.