శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:14 IST)

మహేష్ బాబు "సర్కారు వారి పాట"కు వేలం తేదీ ఖరారైంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. వేసవి సెలవులకు ఈ చిత్రం సందడి చేయనుంది. మే 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మేరకు "సర్కారువారి పాట"కు వేలం తేదీ ఖరారైంది అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
కాగా, కరోనా నేపథ్యంలో అనేక పెద్ద చిత్రాలు విడుదల కాలేదు. ఈ చిత్రాలన్నీ ఇపుడు వరుసగా విడుదలకానున్నాయి. అయితే, ఈ చిత్రాల విడుదల తేదీలపై చిత్ర నిర్మాతలంతా కలిసి చర్చించుకుని చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, తొలుత "ఆర్ఆర్ఆర్", ఆ తర్వాత "భీమ్లా నాయక్", "ఆచార్య" చిత్రాలు విడుదలకానున్నాయి. ఇందులో ఏప్రిల్ 1న "భీమ్లా నాయక్", ఏపిల్ 25న "ఆచార్య" విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
మే 12న "సర్కారువారి పాట" ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందిలావుంటే, ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించగా, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.