మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:34 IST)

శైల‌జారెడ్డి అల్లుడు ఆడియో రిలీజ్ ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ పైన నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆడియోను ఈ ఆదివారం రిలీజ్

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ పైన నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆడియోను ఈ ఆదివారం రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ... కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆడియో వేడుక లేద‌ని తెలిసింది. ఆడియోను డైరెక్టుగా మార్కెట్లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. 
 
ఈ నెల 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ట‌. చైత‌న్య గ‌త చిత్రం యుద్ధం శ‌ర‌ణం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో శైల‌జారెడ్డి అల్లుడు సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి... చైతు ఆశించిన విజ‌యాన్ని శైల‌జారెడ్డి అల్లుడు ఇస్తాడేమో చూడాలి.