ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:01 IST)

పుల్వామా దాడి ప్రతీకారం.. సంచలన నిర్ణయం తీసుకున్న సల్మాన్

పుల్వామా దాడి నేపథ్యంలో దేశమంతా రగిలిపోతోంది. బాలీవుడ్‌కు చెందిన అనేక మంది సెలిబ్రిటీలు అమర జవాన్లకు తమ వంతు సాయం ప్రకటించారు, పాకిస్థానీ నటులపై కూడా నిషేధం విధించారు. తాజాగా సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
 
సల్మాన్ ఖాన్ తన స్వంత బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం 'నోట్ బుక్' నుండి పాకిస్థానీ గాయకుడు అతిఫ్ అస్లాంను తొలగించాడు. నోట్ బుక్ చిత్రంలో ఒక పాట పాడటం కోసం ఇప్పటికే అతిఫ్ అస్లాంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
మరి కొద్ది రోజుల్లో పాట రికార్డింగ్ జరగాల్సి ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి జరగడంతో దీనికి నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ గాయకుడి స్థానంలో మరో భారతీయ గాయకుడిని తీసుకోనున్నారు.