ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 18 మే 2017 (07:38 IST)

'లవ్‌ మామా.. యు ఆర్ లుకింగ్ సూపర్'.. 'కంగ్రాట్స్‌ కోడలా'... ఇలా అన్నది ఎవరు?

వెండితెర హీరో, హీరోయిన్లు మామా కోడలు కానున్నారు. వారెవరో ఇప్పటికే అర్థమైపోయివుంటుంది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లనుంది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కి

వెండితెర హీరో, హీరోయిన్లు మామా కోడలు కానున్నారు. వారెవరో ఇప్పటికే అర్థమైపోయివుంటుంది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లనుంది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్యను సమంత పెళ్లి చేసుకోనుంది. ఈ పెళ్లి కూడా త్వరలోనే జరుగనుంది. ఇదిలావుంటే, నాగ చైతన్య కొత్త చిత్రం ‘రారాండోయ్‌.. వేడుక చూద్దాం’. ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌ సమంతకు బాగా నచ్చేసింది. ట్రైలర్‌లో చైతూ ఇంకా నచ్చేశాడు. 
 
ఈ సంతోషంలో కాబోయే మామగారు, చిత్రనిర్మాత నాగార్జునకు "ఐ లవ్‌ ద ట్రైలర్‌. లవ్‌ మామా... ఇట్స్‌ ఆల్‌ వర్కింగ్‌. హీ ఈజ్‌ లుకింగ్‌ సూపర్‌. ఐయామ్‌ సో హ్యాపీ" అంటూ తన వాట్సాప్‌లో మెస్సేజ్‌ చేశారామె. దీనికి వెంటనే నాగార్జున స్పందిస్తూ... 'కంగ్రాట్స్‌ కోడలా' అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. వాట్సాప్‌లో జరిగిన ఈ చాటింగ్‌ను నాగార్జున ట్విట్టర్‌లో పెట్టారు. మామా కోడళ్ల ముచ్చట చూస్తే భలే మురిపెంగా ఉంది కదూ!