గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (12:10 IST)

సమంత పెళ్ళికి ఆ చీర కట్టుకోనుందట..

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య వివాహం అక్టోబర్ 6న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం కోసం సమంత అదిరిపోయే కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తుందట. గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరుగుతుంది.

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య వివాహం అక్టోబర్ 6న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం కోసం సమంత అదిరిపోయే కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తుందట. గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరుగుతుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహ తంతులో సమంత నాగచైతన్య అమ్మమ్మ డి.రాజేశ్వరి చీరను కట్టుకోనుందని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
స్టైలిష్ డిజైనర్ క్రేషా బజాజ్ సమంత పెళ్లి దుస్తులను రూపొందించనున్నట్లు సమాచారం. పెళ్లి కోసం ఇప్పటికే షాపింగ్ మొదలెట్టేసిన సమంత, చైతూ.. త్వరలోనే సినిమా షూటింగ్ పనులన్నీ ముగించుకుని పెళ్ళి పనుల్లో తలమునకలవుతారని తెలిసింది.
 
ఈ నేపథ్యంలో తన ఎంగేజ్ మెంట్‌కి తెలుపు, బంగారు వర్ణంతో కూడిన చీరను ధరించి అందరి దృష్టిని ఆకట్టుకున్న సమంత.. పెళ్ళి రోజున చైతూ అమ్మమ్మ చీరను కట్టబోతుండటం చర్చనీయాంశమైంది. దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు సతీమణి అయిన రాజేశ్వరి చీరను తన పెళ్ళి వేడుకలో ధరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సమంత సన్నిహితులతో చెప్తుందట.