మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (14:16 IST)

టార్చర్ భరించలేకున్నా.. విడాకులు కావాలి : భర్తపై సింగర్ కౌసల్య ఆరోపణలు

కట్టుకున్న భర్తపై టాలీవుడ్ సింగర్ కౌసల్య సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త తనను ఎన్నో రకాలుగా టార్చర్ చేశాడని టాలీవుడ్ సింగర్ కౌసల్య ఆరోపించింది. ఆయన వల్ల తాను నరకయాతన అనుభవించానని, అందుకే విడాకులు తీసుక

కట్టుకున్న భర్తపై టాలీవుడ్ సింగర్ కౌసల్య సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త తనను ఎన్నో రకాలుగా టార్చర్ చేశాడని టాలీవుడ్ సింగర్ కౌసల్య ఆరోపించింది. ఆయన వల్ల తాను నరకయాతన అనుభవించానని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 'నీ కోసం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కౌసల్య ఇప్పటివరకు 400లకు పైగా సినిమాల్లో పాటలు పాడింది.
 
ఈమె సింగర్‌గా ఉన్న సమయంలో ఎంతో హాయిగా జీవితాన్ని గడిపిన కౌసల్య.. వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక కష్టాలు పడినట్టు చెప్పుకొచ్చింది. సొంత ఇష్టాలకు దూరంగా ఉండాలంటూ తనపై భర్త అధికంగా ఒత్తిడి చేశారని ఆరోపించింది.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... తనకు ఏమాత్రం స్వేచ్ఛ ఉండేది కాదని... భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యుల నుంచి ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చిందని బోరుల విలపిస్తూ చెప్పింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పింది.