గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (17:32 IST)

శివకార్తికేయన్ ప్రిన్స్ లోని పాట విడుద‌ల, రిలీజ్‌ ఖ‌రారు

Prince song
Prince song
శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న 'ప్రిన్స్' చిత్రంలో  ''బింబిలిక్కి పిలాపి'' , జెస్సికా పాటలు చార్ట్ బస్టర్ గా  నిలిచాయి. తాజాగా ఈ చిత్రం నుండి 'హూ యామ్ ఐ' పాటని విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ డ్యాన్స్ నెంబర్ గా ఈ పాటని కంపోజ్  చేశారు. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. డింకర్ కల్వల ఎనర్జిటిక్ గా పాడగా, 'సరస్వతీ పుత్ర' రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఇన్స్టంట్ హిట్ గా అలరించిన ఈ  పాట ప్రిన్స్ ఆల్బమ్ లో మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది.
 
అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌ టైనర్‌ 'ప్రిన్స్'. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.