శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (13:34 IST)

''స్పైడర్‌''కు పుచ్చకాయకు లింకుందా...? అరబిక్ భాషలో ఎందుకు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలు వమ్ము చేయని విధంగా దర్శకుడు మురుగదాస్ స్పైడర్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం షూటంగ్ చివరి దశలో వున్న ఈ చి

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలు వమ్ము చేయని విధంగా దర్శకుడు మురుగదాస్ స్పైడర్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం షూటంగ్ చివరి దశలో వున్న ఈ చిత్ర ఆడియోను సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని మలయాళ, హిందీ భాషల్లోకి డబ్ చేస్తున్నారు. 
 
అంతేకాకుండా అరబిక్ భాషలోనూ ఈ చిత్రాన్ని డబ్ చేసి ఒక రోజున అన్నీ భాషల్లో సినిమాను విడుదల చేయాలని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారు. స్పైడర్ అరబిక్ భాషలోనూ డబ్ అయ్యేందుకు కారణం ఈ సినిమాలోని ఓ పాటేనట. ఈ చిత్రంలోని 'పుచ్చకాయ.. పుచ్చకాయ..' అనే ఒక పాట కూడా అరబిక్ స్టైల్లోనే ఉంటుందట. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు. 
 
అలాగే సెప్టెంబర్ తొమ్మిదో తేదీన చెన్నైలో జరిగే కార్యక్రమంలో స్పైడర్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా అలరించనున్నాడు.