ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (14:38 IST)

ఆ విషయంలో నా భర్తకు నేను సపోర్ట్ చేయను.. శ్రీరెడ్డి

నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. నాని న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యాడు. ఇక నాని సతీమణి అంజనా శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. పబ్లిసిటీ కోసం కొంతమంద

నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. నాని న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యాడు. ఇక నాని సతీమణి అంజనా శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. పబ్లిసిటీ కోసం కొంతమంది కొందరు జీవితాలతో చెలగాటమాడుతున్నారని అంజనా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించింది. ఫేస్‌బుక్ ఖాతాలో ఓ సందేశాన్ని కూడా పోస్టు చేసింది. 
 
హాయ్ మిసెస్.. అంటూ.. తానిప్పుడే అంజన పోస్టు చూశానని.. ''నేను నీ భర్తతో వున్నప్పుడు నువ్వు చూడలేదు. నేను పేరు కోసం తాపత్రయపడటం లేదు. నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు. నాకు ఉన్న పేరు చాలు. ఒకవేళ నా భర్తకే పేరు, డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే, నేను నా భర్తకు మాత్రం సపోర్ట్‌ చేయను'' అంటూ ఘాటుగా కౌంటరిచ్చింది. 
 
అవసరమైతే అలాంటి వాడిని వదిలేసి వెళ్లిపోతానని.. బాధిత మహిళను మాత్రం అవమానపరచనని చెప్పింది. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాననని శ్రీరెడ్డి వెల్లడించింది. తనవైపు సత్యం, కర్మ వుందని.. అందరూ సైలెంట్‌గా వుండండని.. తప్పకుండా ''నీ భర్త కూడా శిక్ష అనుభవించాల్సిందే''నని శ్రీరెడ్డి తెలిపింది.