ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (11:51 IST)

టాప్ హీరోయిన్లు కూడా ఒత్తిడిలో అవకాశాల కోసం నలిగిపోతున్నారు : శ్రీరెడ్డి

తెలుగు అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో వేధింపులు అంతా ఇంతా కాదని సినీ నటి శ్రీరెడ్డి విమర్శించారు. తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్‌లో అవకాశాలివ్వరంటూ శ్రీరెడ్డి ఆరోపించారు. పడుకుంటే కానీ అవకాశాలు రావన్న శ్రీర

తెలుగు అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో వేధింపులు అంతా ఇంతా కాదని సినీ నటి శ్రీరెడ్డి విమర్శించారు. తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్‌లో అవకాశాలివ్వరంటూ శ్రీరెడ్డి ఆరోపించారు. పడుకుంటే కానీ అవకాశాలు రావన్న శ్రీరెడ్డి.. తెలుగు నటీమణులకు మన పరిశ్రమలో గౌరవం లేదన్నారు. కో-ఆర్డినేటర్స్ ఫిలిమ్ ఇండస్ట్రీలో విలన్లని శ్రీరెడ్డి ఆరోపించారు. వారే అమ్మాయిలను వాడుకుంటున్నారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.
 
ఓ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఓ కో ఆర్డినేటర్ బండారం బయటపడిందని.. తాను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. కో-ఆర్డినేటర్లు అమాయక అమ్మాయిలను నలిపేస్తున్నారని శ్రీరెడ్డి మండిపడ్డారు. 
 
టాప్ హీరోయిన్లు కూడా ఒత్తిడిలో అవకాశాల కోసం నలిగిపోతున్నారని శ్రీరెడ్డి తెలిపారు. చాంద్ ఖాన్ అనే ప్రముఖ కో ఆర్డినేటర్ వ్యక్తి స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డారని శ్రీరెడ్డి చెప్పారు. కో-ఆర్డినేటర్ల దళారీల వ్యవస్థలో అమ్మాయిలు నలిగిపోతున్నారని... అమ్మాయిలకు అవకాశాలు రావట్లేదని శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.