ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (15:44 IST)

శ్రీవారు అంటే శ్రీదేవికి అపారమైన భక్తి... లడ్డు అంటే మహా ఇష్టం..

తిరుమల శ్రీవారు అంటే నటి శ్రీదేవికి అపారమైన భక్తి. చిన్నతనం నుంచే శ్రీనివాసుడుని దర్శించుకున్న తర్వాతనే ఆమె ఏ పని చేసేది కాదట. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు ఆగష్టు 13వ తేదీ ఎన్ని పనులున్నా పక్కనబెట్టి

తిరుమల శ్రీవారు అంటే నటి శ్రీదేవికి అపారమైన భక్తి. చిన్నతనం నుంచే శ్రీనివాసుడుని దర్శించుకున్న తర్వాతనే ఆమె ఏ పని చేసేది కాదట. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు ఆగష్టు 13వ తేదీ ఎన్ని పనులున్నా పక్కనబెట్టి శ్రీవారిని దర్శించుకోవడానికి శ్రీదేవి వచ్చేవారని తిరుపతిలో ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏదైనా సినిమాను ఒప్పుకున్నా.. సినిమా పూర్తయిన తర్వాత హిట్ కావాలని కూడా శ్రీదేవి స్వామివారిని పూజించేవారట. ఆమె ఇంట్లో అతిపెద్ద శ్రీవారి చిత్రపటాన్ని ఉంచి ప్రతిరోజు పూజలు నిర్వహించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 
నెలకు ఒక్కసారైనా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేవారని, తిరుపతి నుంచే తాము స్వామివారి ప్రసాదాలను పంపించేవారమని, గోవిందా.. గోవిందా సినిమాలో నటించేప్పుడు షూటింగ్ అయిపోయిన వెంటనే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుని శ్రీదేవి వచ్చేవారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివాహమైన తర్వాత కూడా తన భర్త, పిల్లలతో కలిసి ఎన్నోసార్లు తిరుమలకు శ్రీదేవి వచ్చారని చెబుతున్నారు బంధువులు. శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిందన్న విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.