శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 మే 2022 (14:13 IST)

ఒసేయ్ రాముల‌మ్మ‌2లో సుమ క‌నకాల‌?

Sukkku- Suma
Sukkku- Suma
యాంక‌ర్‌గా నెంబ‌ర్ 1 స్థానంలో వున్న సుమ క‌న‌కాల న‌టిగా మారి జయమ్మ పంచాయితీ చిత్రంలో న‌టించింది. ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతుంది. ఈ సినిమాను ప్రివ్యూరోజు చూసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆమె న‌ట‌న‌తోపాటు చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్‌ను వెతుక్కుంటూ వ‌చ్చి అభింద‌న‌లు కురిపించారు. 
 
మారుమూల గ్రామీణ క‌థ‌లు మ‌ల‌యాళంలో వ‌స్తున్నాయ్ తెలుగులో రావ‌డంలేద‌న్న త‌రుణంలో కేరాఫ్ కంచ‌ర‌పాలెం వంటి సినిమా వ‌చ్చింది. ఇప్పుడు అదే త‌ర‌హాలో వున్నా మాన‌వీయ‌కోణంలో వున్న సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా ఓ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు నాతో మ‌ళ్ళీ సినిమా చేస్తాడో లేదో. ఎందుకంటే నేను పీల్చి పిప్పి చేసేశాను ఇక విసుగు పుట్టించానంటూ పేర్కొంది. 
 
అయితే ఇదే టైంలో ద‌ర్శ‌కుడు ఓసేయ్ రాముల‌మ్మ 2 తీస్తున్న‌ట్లు తెలిసింద‌ని ఆమెను అడిగితే, ఏమో.. ఆయ‌న్నే అడ‌గండంటూ పేర్కొంది. విజ‌యశాంతి న‌టించిన ఈ చిత్రం ఎంత ట్రెండ్ సృష్టిందో తెలిసిందే. ఇప్పుడు ఆ త‌ర‌హా పాత్ర వేయాలంటే సుమ‌నే క‌రెక్ట్ అని `జ‌య‌మ్మ‌.. సినిమా చూశాక చాలా మంది భావించార‌ట‌. చిత్ర‌మేమంటే, ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత‌గా విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. బ‌హుశా ఆ సినిమానే ఓజేయ్ రాముల‌మ్మా2గా వుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.