సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (10:19 IST)

అనగనగా ఉపాధ్యాయుడిగా సుమంత్‌

Sumanth, Kajal Chaudhary, Rakesh Master Viharsh
Sumanth, Kajal Chaudhary, Rakesh Master Viharsh
సుమంత్‌ లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం ‘అనగనగా’. కాజల్‌ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు సంవత్సరాది కానుకగా ప్రేక్షకులను అలరించనుంది.
 
తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ ని విడుదల చేశారు. సుమంత్‌ ఇందులో  చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే అర్థమవుతుందో చెప్పే ఉపాధ్యాయుడిగా కనిపించారు.  ‘నోటితో విసిరి.. చేతులతో ఏరుకునేది ఏంటి’ అంటూ సుమంత్‌ సంధించిన పొడుపు కథ ఆసక్తికరంగా ఉంది.
 
సుమంత్‌ తన క్లాస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. కాజల్ చౌదరి, అవసరాల శ్రీనివాస్ ప్రజెన్స్ కూడా ఆసక్తికరంగా వుంది. డైరెక్టర్ సన్నీ సంజయ్ అందరికీ కనెక్ట్ అయ్యే కథని హార్ట్ టచ్చింగ్ గా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.
 
మ్యూజిక్, కెమరావర్క్ కథలోని ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. థాట్ ప్రొవొకింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ గా ప్రజెంట్ చేసిన టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.
 
ఈ చిత్రం తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఉగాది సందర్భంగా స్ట్రీమింగ్‌ కానుంది.  
 
నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్, రాకేష్ రాచకొండ, B.V.S రవి, కౌముది నేమాని