1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:20 IST)

రేష్మికి చెక్ పెట్టాలనే సన్నీని రంగంలోకి దించారా? గుంటూరు టాకీస్‌లో సన్నీ అందాలు?

టాలీవుడ్‌లో జబర్దస్త్ యాంకర్ రేష్మికి చెక్ పెట్టాలని.. మరో హాట్ భామ సన్నీలియోన్‌ను బరిలోకి దించనున్నట్లు గుంటూరు టాకీస్ యూనిట్ వెల్లడించింది. పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్‌లోకి వచ్చిన సన్నీలియోన్ అంటే

టాలీవుడ్‌లో జబర్దస్త్ యాంకర్ రేష్మికి చెక్ పెట్టాలని.. మరో హాట్ భామ సన్నీలియోన్‌ను బరిలోకి దించనున్నట్లు గుంటూరు టాకీస్ యూనిట్ వెల్లడించింది. పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్‌లోకి వచ్చిన సన్నీలియోన్ అంటే చాలామందికి 'ఎ' సర్టిఫికెట్ మూవీసే గుర్తొస్తాయి. ఈ హాట్ లేడీ సైతం తనకు సూటయ్యే హాట్ హాట్ కథాంశాలనే ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. 
 
ఆ మధ్య తెలుగులో వచ్చిన 'కరెంట్ తీగ'లో కాసేపు ఆడియెన్స్‌ను మురిపించిన సన్నీలియోన్.. మళ్లీ చాలాకాలం తరువాత తెలుగులో తళుక్కుమనేందుకు సిద్ధమవుతోంది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో వచ్చిన 'గుంటూరు టాకీస్'కు సీక్వెల్ ఇటీవలే మొదలైంది.
 
మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో అమ్మడు ఒక పాట, కొన్ని సీన్లలో కనిపించింది. హాటు హాటుగా అందాలను ఆరబోయడం ఈమెకు కొత్తేం కాదు కాబట్టి.. తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దగా కిక్ ఫీలవ్వలేదు అప్పట్లో. అయితే ఆమెతో ఏదైనా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయిస్తే ఎలా ఉంటుంది అనేదే చాలామంది ప్లాన్. ఇప్పుడు అది కూడా జరుగుతోంది. త్వరలో రెడీ అవ్వనున్న 'గుంటూర్ టాకీస్' సీక్వెల్ 'గుంటూర్ టాకీస్ 2' సినిమాలో సన్నీ హాటు హాటుగా నటించనున్నట్లు తెలుస్తోంది.