శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (12:05 IST)

శృంగార సీన్లు, ముద్దు సీన్లపై తమన్నా సంచలన కామెంట్స్

'హ్యాపీడేస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా. తన 15 ఏళ్ల సినీ కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అటు బాలీవుడ్‌లో, ఇటు దక్షిణాదిలో వరుస సినిమాలతో తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్ సినీ కెరీర్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి, మీటూ ఉద్యమంపై తన అభిప్రాయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
కెరీర్ మొదట్లోనే తాను శృంగారం, ముద్దు సీన్లలో నటించనని తెగేసి చెప్పాను. ఇప్పుడు అడిగినా అదే చెప్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. టాలీవుడ్‌లో తనకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయని, బాలీవుడ్‌లో ఇప్పుడు మంచి సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో అక్కడ కూడా అవకాశాలు పెరిగితే బాగుంటుందని మనస్సులో మాట చెప్పారు. 
 
గతేడాది బాలీవుడ్‌ను మీటూ ప్రకంపనలు బాగా కుదిపేసిన నేపథ్యంలో పలువురు నటులు, డైరెక్టర్‌లు, నిర్మాతలపై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న దర్శకుడు షాజిద్ ఖాన్‌తో తమన్నా హిమ్మత్ వాలా, హంషకల్స్ అనే రెండు సినిమాలలో పని చేసింది. ఆ సినిమాలు అంతగా ఆడలేదు, ఇక దర్శకుడు తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, తన దర్శకత్వంలో పని చేయడం చాలా బాగుందని తెలిపింది.
 
సినిమా కథ, తన పెర్ఫామెన్స్‌ మాత్రమే తనకు ముఖ్యమని, మిగతా విషయాలు పట్టించుకోనని తెలిపింది. లైంగిక వేధింపులు కేవలం సినీ పరిశ్రమలోనే కాదు, అన్ని రంగాల్లో ఉంటాయని పేర్కొంది. హాట్ సీన్స్, కిస్ సీన్స్‌లో నటించాలని ఎవరూ బలవంతపెట్టరు. అది మన ఛాయిస్. బలవంతపెడుతున్నట్లు ఎవరైనా చెపితే అందులో అర్థం లేదని పేర్కొంది. ఇండస్ట్రీలో మనకు తెలియకుండా ఏదీ జరగదని తమన్నా తెలిపింది.