బాలయ్య 101 సినిమాలో శ్రియ లేనట్టే.. బాహుబలి అవంతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?
నందమూరి హీరో బాలయ్య బాబు 101వ సినిమా గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. బాలయ్య 101వ సినిమాలో బాహుబలి అవంతిక హీరోయిన్‌గా నటించబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలయ్య 101వ సినిమా.. కే.ఎస్.
నందమూరి హీరో బాలయ్య బాబు 101వ సినిమా గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. బాలయ్య 101వ సినిమాలో బాహుబలి అవంతిక హీరోయిన్‌గా నటించబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలయ్య 101వ సినిమా.. కే.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమాలోను శ్రియ కథానాయికగా నటించే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది.
అయితే తాజాగా తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథను .. పాత్రను తమన్నాకి చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయని సినీ జనం అంటున్నారు. దీంతో శ్రియను పక్కనబెట్టి తమన్నాను ఎంపిక చేశారని టాక్ వస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో బాలకృష్ణ చేసిన ఫ్యాక్షన్ సినిమాలు భారీ విజయాలను సాధించడం వలన, ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.