ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (10:19 IST)

గ్లామర్ పాత్రలో రెచ్చిపోయినా.. ముద్దుల జోలికెళ్లని మిల్కీబ్యూటీ

తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఈ మిలమిల అందాల మిల్కీ బ్యూటీ బోలెడు సార్లు కుర్రకారుకు ఉదారంగా 'హ్యాపీ డేస్' పంచి పెట్టింది. రీసెంట్‌గా ఈ మిల్క్ బ్యూటీ 'నెక్ట్స్ ఏంటి' అనే చిత్రం చేసింది. ఈ చిత్రం ఎన్నికల సమయంలో వచ్చింది తెలియదు.. పోయింది తెలియదు. అయితే ఆ సంగతి పక్కన పెడితే తమన్నా కెరీర్ కూడా ప్రస్తుతం నెక్ట్స్ ఏంటి అన్నట్టే ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. 
 
గత 13 యేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో గ్లామరస్ పాత్రలను పోషించిన తమన్నా.. ముద్దుల జోలికి మాత్రం వెళ్లలేదు. అంటే తన పరిధిలను ఆమె ఎక్కడా దాటలేదు. కానీ హీరోయిన్స్ ఒక్కో సంవత్సరం పాతబడేకొద్దీ ఆఫర్లు రాబట్టటం కష్టం. కానీ, తమ్మూ విషయంలో అలాంటిదేమీ లేదు. అయినప్పటికీ 'నెక్ట్స్ ఏంటి' సినిమాలో కాస్త బోల్డ్‌గా కనిపించింది. 
 
సెక్స్ గురించి డైలాగ్స్ గుప్పిస్తూ, పొట్టి బట్టలు వేసుకుంటూ రెచ్చిపోయింది. అయినా ఫలితం ఆశించిన రాలేదు. ఇప్పుడు ఆమె హోప్స్ అన్నీ 'దటీజ్ మహాలక్ష్మీ' మీదే పెట్టుకుందట. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'క్వీన్'కు 'దటీజ్ మహాలక్ష్మీ' తెలుగు రీమేక్. ఇందులో కంగనా చేసిన పాత్రలో తమన్నా కనిపించబోతోంది. 
 
అయితే.. కంగనా రేంజ్‌లో ట్యామీ మెప్పిస్తుందా అనేది చాలా మంది డౌట్. యాక్టింగ్ ఇరగదీసినా 'దటీజ్ మహాలక్ష్మీ'మల్టీప్లెక్స్ మూవీ అని, మాస్ జనాల్లోకి ఎంతవరకూ వెళుతుందో అంటున్నారు. పైగా మల్టీప్లెక్స్ జనాలు 'క్వీన్' చూసేసి ఉంటారు కాబట్టి 'దటీజ్ మహాలక్ష్మీ' చూడటానికి ఎంత వరకూ ఉత్సాహం చూపిస్తారో అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు.
 
ఇకపోతే, తమన్నా చేతిలో మరికొన్ని కమర్షియల్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో 'ఎఫ్2' ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొలిసారి సీనియర్ హీరో వెంకటేశ్ సరసన తమన్నా ఇందులో నటిస్తోంది. ఇది వర్కౌట్ అయినా తమన్నకు పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు రావటం ఖాయం. ఎందుకంటే.. 'సైరా' సినిమాలోనూ చిరుతో కనిపించబోతోంది. 
 
'సైరా', 'ఎఫ్2' వర్కవుట్ అయితే మరికొన్ని ఆఫర్లు పక్కా అంటున్నారు విశ్లేషకులు. ఇవేకాక 'అభినేత్రి 2' వంటి సినిమా కూడా చేస్తోంది. దాని ఫలితంపైన కూడా తమన్నా తెలుగు, తమిళ ఆఫర్లు ఆధారపడబోతున్నాయి. మరి 28 ఏళ్ల మిల్కీ బ్యూటీ 30 దాటక కూడా హీరోయిన్‌గా మురిపిస్తుందో.. లేదంటే, మూడు ముళ్ల మూడ్‌లోకి వెళ్లిపోతుందో చూడాలి.