బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (15:19 IST)

అమ్మడు ఏంటీ కుమ్ముడు... తమన్నాకు డీల్ నచ్చితే చాలట...

సినీ పరిశ్రమలో డబ్బులిస్తే చాలు ఎలాగైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది హీరోయిన్‌లు. కొత్తగా వచ్చే హీరోయిన్లయితే అందాలు ఆరబోయడానికి ఎప్పుడూ సిద్దమే. ఎందుకంటే మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చేం

సినీ పరిశ్రమలో డబ్బులిస్తే చాలు ఎలాగైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది హీరోయిన్‌లు. కొత్తగా వచ్చే హీరోయిన్లయితే అందాలు ఆరబోయడానికి ఎప్పుడూ సిద్దమే. ఎందుకంటే మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చేందుకు. అయితే ఇప్పటికే తెలుగు చిత్రసీమలో నిలదొక్కుకున్న కొంతమంది హీరోయిన్లు కూడా డబ్బుమీద వ్యామోహంతో ఎలా పడితే అలా నటించడానికి సిద్ధమవుతున్నారు. అందులో తమన్నా మొదటగా ఉందని సినీవర్గాలే చెప్పుకుంటున్నాయి.
 
మిల్క్ బ్యూటీ తమన్నా.. అప్పుడెప్పుడో శేఖర్ కమ్ముల సినిమాలో 'హ్యాపీ డేస్' సినిమాల్లో నటించి ఆ తరువాత బిజీగా మారిపోయిన హీరోయిన్. అగ్రహీరోయిలతో నటించిన తమన్నా ఒక్క తెలుగులోనే కాదు తమిళం, హిందీ బాషల్లో కూడా నటించింది. కానీ ప్రస్తుతం తమన్నా వాణిజ్య సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తోందట. వాణిజ్య సినిమాల్లో ఎలా కావాలంటే అలా నటిస్తా.. కానీ నేను అడిగినంత డబ్బులు ఇవ్వాలని నిర్మాతలకు తెగేసి చెప్పోస్తోందట ఈ అమ్మడు. డీల్ నచ్చితే ఎక్కడికైనా వచ్చి నటించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెబుతోందట తమన్నా.