శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (16:03 IST)

తెలుగులో అగస్త్యన్‌ 'లక్ష్మీపుత్రుడు'

ప్రేమలేఖ, ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రాల దర్శకుడు అగస్త్యన్‌ దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'సెల్వమ్‌' ఇప్పుడు తెలుగులో 'లక్ష్మీపుత్రుడు'గా అనువాదమవుతోంది. నంద దొరైరాజ్‌, ఉమ, వాణి కాంబినేషన్‌లో రూపొందిం

ప్రేమలేఖ, ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రాల దర్శకుడు అగస్త్యన్‌ దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'సెల్వమ్‌' ఇప్పుడు తెలుగులో 'లక్ష్మీపుత్రుడు'గా అనువాదమవుతోంది. నంద దొరైరాజ్‌, ఉమ, వాణి కాంబినేషన్‌లో రూపొందింది. మెమొరీలాస్‌ పేషెంట్‌ ఎలా ప్రేమికుడిగా మారాడనేది ఈ చిత్రాన్ని ఎ. రమాదేవి సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై ఎ. రమేష్‌బాబు అందిస్తున్నారు. 
 
ఇటీవలే ఆడియోను హైదరాబాద్‌లో నిర్వహించారు. సీడీలను ఆవిష్కరించిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి మాట్లాడుతూ... క్రియేటివిటీ సినిమాలను తీసిన దర్శకుల్లో అగస్తన్‌ ఒకరనీ, ప్రతి ఫ్రేమూ వైవిధ్యంగా ఉంటుందనీ, అలాగే దేవా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుంటుందని పేర్కొన్నారు.
 
ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన భారతీబాబు మాట్లాడుతూ సంగీత, సాహిత్యాల మేలికలయికతో రూపొందిన చిత్రమిదన్నారు. ఇంతవరకు 1400 పాటలు రాయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. నిర్మాత రమేష్‌బాబు తెలుపుతూ శివరంజీని మ్యూజిక్‌ద్వారా ఆడియో విడుదలైంది. సినిమాను వచ్చేనెల రెండోవారంలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.