ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (18:51 IST)

ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేసేది లేదు..

theatres
theatres
ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేయించేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్వాహకుడు తిరుప్పూర్ సుబ్బయ్యన్ చెప్పారు. ఇటీవల చెన్నైలో విజయ్ నటించిన లియో సినిమా ట్రైలర్ విడుదలైంది. 
 
ఈ ట్రైలర్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఈ ఆవేశం డోస్ కాస్త ఎక్కువ కావడంతో పలు థియేటర్లు ధ్వంసం అయ్యాయి. థియేటర్లలోని ఫర్నీచర్‌ను పగులకొట్టడం వంటివి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇకపై థియేటర్లలో ట్రైలర్‌లు విడుదల కావు. కొన్ని చిత్రాలలో ట్రైలర్‌లు విడుదల చేయడం వల్ల చట్ట నియంత్రణ సమస్య ఏర్పడడంతో పాటు థియేటర్‌లో కూడా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. 
 
కాబట్టి ఇకపై ట్రైలర్‌లు విడుదల చేసేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించినట్లు తిరుప్పూర్ సుబ్బయ్యన్ తెలిపారు.