బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (06:19 IST)

న్యూ ఇయర్ జోష్ : స్మిమ్మింగ్‌పూల్‌లో అతనితో కలిసి త్రిష ఏం చేసిందో తెలుసా?

కొత్త సంవత్సర వేడుకలను నటి త్రిష అదిరిపోయేలా సెలెబ్రేట్ చేసిందట. అదీకూడా తన ఇంట్లోనే. నక్షత్ర హోటల్స్ అయితే తాను చేసే హంగమా బయటకు పొక్కుతుందని భావించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ దఫా మాత్రం తన ఇంట్లోనే ఈ వేడుక

కొత్త సంవత్సర వేడుకలను నటి త్రిష అదిరిపోయేలా సెలెబ్రేట్ చేసిందట. అదీకూడా తన ఇంట్లోనే. నక్షత్ర హోటల్స్ అయితే తాను చేసే హంగమా బయటకు పొక్కుతుందని భావించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ దఫా మాత్రం తన ఇంట్లోనే ఈ వేడుకలను ఆడ - మగ స్నేహితులతో కలిసి జరుపుకున్నదట. 
 
ఈ వేడుకలు ఇంట్లో కావడంతో త్రిష మరింతగా రెచ్చిపోయిందట. దీనికి సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఇపుడు వైరల్‌గా మారింది. స్విమ్మింగ్‌పూల్ ప్రక్కన నిల్చొని ఫోటోలకి పోజులిచ్చింది. మగ, ఆడ స్నేహితులతో కలసి ఫుల్‌గా స్విమ్మింగ్ చేసింది. తన ఫ్యాషన్ డిజైనర్ స్నేహితుడు సిడ్నీ స్లేడన్‌తో కలసి రచ్చ చేసింది. మొత్తంమీద మూడు పదుల వయసులోనూ తన అందాలతో పాటు... తనలోని జోష్ ఏమాత్రం తగ్గలేదని త్రిష రుజువు చేసింది.