మెగాస్టార్ చిరంజీవిని దెబ్బకొట్టిన తితిదే ఛైర్మన్ కృష్ణమూర్తి.. ఎందుకని.. ఏ విషయంలో!
మెగాస్టార్ చిరంజీవి. 149సినిమాల్లో నటించి చివరకు 10 సంవత్సరాల సుధీర్ఘ గ్యాప్ తరువాత "ఖైదీ నెంబర్ 150"గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా ఎప్పుడొప్పుడు వస్తుందా అన్న ఆతృతతో చిరు అభి
మెగాస్టార్ చిరంజీవి. 149సినిమాల్లో నటించి చివరకు 10 సంవత్సరాల సుధీర్ఘ గ్యాప్ తరువాత "ఖైదీ నెంబర్ 150"గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా ఎప్పుడొప్పుడు వస్తుందా అన్న ఆతృతతో చిరు అభిమానులు ఎదురుచూశారు. సంక్రాంతికి ముందే సినిమా విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపయ్యింది. మొత్తం మీద సినిమాను రిలీజ్ చేశారు. హిట్ టాక్‌తో సినిమా ముందుకు వెళుతోంది. అయితే చిరు సినిమాకు తిరుపతిలో రాజకీయ రంగు పులిమారు. రాజకీయం వేరు.. సినిమా వేరు అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించారు తిరుపతిలో ఒక అధికార పార్టీ నేత.
చదలవాడ కృష్ణమూర్తి. ఈ పేరు తెలియని వారు తిరుపతిలో బహుశా ఉండరు. ఎమ్మెల్యేగాను, ప్రజాప్రతినిధిగాను ఎన్నోసార్లు పనిచేశారు ఈయన. అంతేకాదు ఇప్పుడు ఏకంగా తితిదే ఛైర్మనే.. అయితే అధికారపార్టీలో మాత్రం ఈయనది అందె వేసిన చేయి. ఈయన చెప్పినట్లే నగరంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇదంతా బాగానే ఉన్నా తితిదే ఛైర్మన్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని దెబ్బతీశాడు. ఎలాగంటారా.. చిరు నటించిన 'ఖైదీ నెంబర్ 150'వ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తిరుపతిలో 8 థియేటర్లలో సినిమా రిలీజైంది.
తిరుపతిలో విడుదలైన థియేటర్లలో 4 తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నడిచేది. అయితే తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చిరు సినిమా విషయంలో జాగ్రత్తపడ్డారు. చిరంజీవికి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు తన థియేటర్ల ఆవరణలో ఏర్పాటు చేయనివ్వలేదు. కేవలం బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు మాత్రమే పెద్దవిగా వేయించారు. కారణం అధికారపార్టీ నేత. అందులోను తితిదే ఛైర్మన్.
ఇందులో మరో కారణం లేకపోలేదు. చిరంజీవి తిరుపతి నుంచి పార్టీ ప్రారంభించి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అలా చిరు తిరుపతి ప్రజలకు సుపరిచితులు. చిరు బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వల్ల చిరు క్రేజ్ పెరిగే అవకాశం ఉన్నందున ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడ్డారు. అంతే కాదు అధికార పార్టీ నేతగా ఉండి చిరు ఫోటోలు పెడితే పార్టీ సీనియర్ నేతల నుంచి మొటిక్కాయలు తప్పదని ఆలోచించారు చదలవాడ కృష్ణమూర్తి. అందుకే థియేటర్ సిబ్బందికి బల్లగుద్ది చెప్పేశారట.
చిరు బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు తన థియేటర్ వద్ద కనిపించకూడదని.. అందుకే ఎక్కడా లేకుండా జాగ్రత్త పడ్డారు సిబ్బంది. పేరుకే చదలవాడకు చెందిన గ్రూప్స్‌లో నాలుగు థియేటర్లలో సినిమా ప్రదర్సితమవుతున్నా ఎక్కడా చిరు ఫ్లెక్సీ, బ్యానర్లు కనిపించ లేదు. దీంతో చిరు అభిమానులు నిరాశకు గురయ్యారు. థియేటర్ సిబ్బందిని ప్రశ్నించే ప్రయత్నం చేసినా వారు మాకేం తెలియదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ చదలవాడ కృష్ణమూర్తి సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టడం ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.