ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 27 మే 2021 (19:57 IST)

ఇర‌వై రెండేళ్ళ‌ మల్టీస్టారర్ సుల్తాన్

krishamr aju, balakrishna, krishna
కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా `సుల్తాన్`. ఈరోజుకు 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు బాల‌కృష్ణ స‌మ‌క‌ర్ప‌కులు. పీబీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై బాలయ్య తోడల్లుడు ఎం.ఆర్‌.వి. ప్ర‌సాద్‌ నిర్మించారు. ముందుగా కృష్ణ, బాలకృష్ణలపై క్లాప్‌తో షూటింగ్ మొదలైంది. ఆ త‌ర్వాత కృష్ణంరాజు తోడ‌య్యారు. క‌థ ప్ర‌కారం కృష్ణ,కృష్ణంరాజు, బాలకృష్ణ)లపై ఓ పాటను అండమాన్‌లో చిత్రీకరించారు. జనగణమన జనయిత్రి నా భరత భూమి అంటూ ఈ ముగ్గురిపై దేశ భక్తి గీతాన్ని తెరకెక్కించారు.
 
Balakrishna, roja
విశేషం ఏమంటే, 1999, మే 27న ఎన్టీఆర్ జయంతి కానుకగా ఒక రోజు ముందు విడుదల చేశారు. ఇది అప్ప‌ట్లో కొన్నిచోట్ల ఏవ‌రేజ్‌గా ఆడితే కొన్ని సెంట‌ర్ల‌లో వంద‌రోజులు ఆడింది. ఇందులో బాల‌కృష్ణ రెండు పాత్ర‌లు పోషించారు. రోజా, రచన, దీప్తి బట్నాగర్ హీరోయిన్స్‌గా నటించారు. కృష్ణ సీబీ సీఐడీ ఆఫీసర్గా కృష్ణంరాజు సీబీఐ ఆఫీసర్ గా న‌టించారు. ఈ సినిమా గురించి నంద‌మూరి ఫ్యాన్స్ త‌న సోష‌ల్ మీడియాలో ముందుగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. రేపు బాల‌కృష్ణ రాముడిపై ఓ దండ‌కం పాడ‌బోతున్నార‌ని అది అంద‌రికీ శ్రీ‌రామ‌ర‌క్ష కావాల‌ని కోరుకున్నారు.