బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (14:03 IST)

నేను హీరో కుమార్తెనే.. కానీ లైంగిక వేధింపులు తప్పలేదు : వరలక్ష్మి శరత్ కుమార్

మలయాళ హీరోయిన్ భావనకు కొచ్చిలో ఎదురైన చేదు అనుభవంతో తారల్లో అభద్రతా భావం నెలకొంది. హీరోయిన్లు తమకుతోచిన విధంగా తమలోని ఆందోళనను వ్యక్తంచేస్తున్నారు. తాజాగా తమిళ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె, నటి వరలక్ష్

మలయాళ హీరోయిన్ భావనకు కొచ్చిలో ఎదురైన చేదు అనుభవంతో తారల్లో అభద్రతా భావం నెలకొంది. హీరోయిన్లు తమకుతోచిన విధంగా తమలోని ఆందోళనను వ్యక్తంచేస్తున్నారు. తాజాగా తమిళ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె, నటి వరలక్ష్మి సహ నటి భావనకు సంఘీభావం తెలుపుతూనే... తనూ లైంగిక వేధింపులకు గురయ్యానంటూ సంచలన ప్రకటన చేశారు. 
 
ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ ప్రోగ్రామింగ్‌ హెడ్‌ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. దీనిపై ఆమె ఒక సుదీర్ఘ లేఖ రాశారు. అందులో తనకు ఎదురైన చేదు అనుభవంతోపాటు నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా తీవ్రంగా స్పందించారు. 
 
'నేటి సామాజిక మాధ్యమ ప్రపంచంలో యదార్థాలు కూడా తప్పుగా చూస్తున్నారు. అది జరగకూడదని కోరుకుంటా. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ ప్రోగ్రామింగ్‌ హెడ్‌తో ఒక సమావేశంలో పాల్గొన్నాను. సమావేశం చివరిన 'బయట ఎప్పుడు కలుద్దాం?' అనడిగాడు. 'మరేదైనా పని కోసమా?' అనడిగాను. వెకిలిగా నవ్వుతూ 'లేదు లేదు. పని కాదు. ఇతర విషయాల కోసం' అన్నాడు. నాలో కలిగిన దిగ్ర్భాంతి, కోపాన్నిపైకి కనిపించనీయకుండా 'సారీ! దయచేసి వదిలేయండి' అన్నాను. 
 
దాంతో 'అంటే... ఇక అంతే?' అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు. 'సినీ పరిశ్రమ అంటే ఇంతే కదా. నీకు తెలిసే అందులోకి వెళ్లావు. ఇప్పుడెందుకు ఫిర్యాదు చేస్తున్నావు' అని కొందరు అంటున్నారు. అందుకు నా సమాధానం ఇదీ.. నాకు నటన అంటే ఇష్టం. కష్టపడతాను, పని విషయంలో ఖచ్చితంగా ఉంటాను. స్క్రీన్‌పై గ్లామరస్‌ లైఫ్‌లో ఉన్నాను కాబట్టి నా గురించి అగౌరవంగా మాట్లాడితే ఊరుకోను" అని వరలక్ష్మి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.