శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (17:20 IST)

బాలకృష్ణ 'వేటగాడు' వేషం అదిరిపోయింది...

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు'. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఈయన ఇప్పటికే పలు కీలక గెటప్స్‌లో బాలయ్య ఇప్పటికే అదరగొట్టాడు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రతి ఒక్క పోస్టర్ ఉంది. 
 
తాజాగా 'వేటగాడు' చిత్రంలో ఎన్టీఆర్ లుక్ రివీల్ అయ్యింది. అచ్చు ఎన్టీఆర్ దిగిపోయినట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఎన్టీఆర్ చిత్ర కెరీర్‌లో వేటగాడు చాలా కీలకంగా చెప్పుకుంటారు. ఆ చిత్రంతో ఎన్నో రికార్డులను ఎన్టీఆర్ దక్కించుకున్నారు.
 
అందుకే ఆ చిత్రంను ఈ బయోపిక్‌లో కీలకంగా చూపించబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌కు జోడీగా అప్పట్లో చేసిన శ్రీదేవి పాత్రలో ఇపుడు రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారు. దీంతో బాలయ్య - రకుల్‌ల కాంబినేషన్‌లో 'ఆకుచాటు పిందె తడిసే' పాటను కూడా చిత్రీకరించారు. ఇంకా వేటగాడు చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను కూడా 'ఎన్టీఆర్'లో పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
 
కాగా, ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం తొలి భాగాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది విడుదల చేసేందు ప్లాన్ చేస్తున్నారు. రెండో భాగాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా భారీగా బిజినెస్ అవుతోంది. ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఒక్కో పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూనే ఉన్నాయి.