మత్తులో వుండే విద్యాబాలన్
'డర్టీ పిక్చర్' ఫేమ్ విద్యాబాలన్ హుక్కా తాగుతూ మత్తులో వుండే పాత్రను పోషిస్తోంది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'బేగం జాన్'. ఈ స్టిల్ గురువారంనాడు నెట్‌లో విడుదలైంది. 'కహానీ', 'కహానీ-2' వంటి చిత్రాలతో మెప్పించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో వ్యభిచార గృ
'డర్టీ పిక్చర్' ఫేమ్ విద్యాబాలన్ హుక్కా తాగుతూ మత్తులో వుండే పాత్రను పోషిస్తోంది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'బేగం జాన్'. ఈ స్టిల్ గురువారంనాడు నెట్‌లో విడుదలైంది. 'కహానీ', 'కహానీ-2' వంటి చిత్రాలతో మెప్పించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో వ్యభిచార గృహ నిర్వాహకురాలి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో హుక్కా తాగుతూ కనిపించిన తీరు చిత్రంపై అంచనాలు పెంచుతోంది.
బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇది. బెంగాలీలో 'రాజ్ కహిని' పేరుతో శ్రీజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. నసీరుద్దీన్ షా, రాజేశ్ శర్మ, గౌహర్‌ఖాన్, పల్లవీ శారద ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.