సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (13:24 IST)

ఛీ.. ఛీ... పాడు సిగరెట్ అలవాటు మానుకోరు కదా?

భర్త : ఆఫీసు నుంచి విచారంగా ఇంటికొస్తాడు. భార్య : ఎందుకు అలా ఉన్నారు? భర్త : మా ఆఫీస్ భవనం కూలిపోయింది.. నా కొలీగ్స్ అంతా చనిపోయారు. భార్య : మరి మీరెలా బ్రతికారు? భర్త : ఆ సమయంలో నేను సిగరెట్ తాగడాన

భర్త : ఆఫీసు నుంచి విచారంగా ఇంటికొస్తాడు.
భార్య : ఎందుకు అలా ఉన్నారు? 
భర్త : మా ఆఫీస్ భవనం కూలిపోయింది.. నా కొలీగ్స్ అంతా చనిపోయారు. 
భార్య : మరి మీరెలా బ్రతికారు?
భర్త : ఆ సమయంలో నేను సిగరెట్ తాగడానికి బయటకు వచ్చాను. 
భార్య : థ్యాంక్ గాడ్.. ఎలాగో బతికారు.
 
ఆ తర్వాత భర్త సోఫాలో కూర్చొని మందు తాగుతూ టీవీ ఆన్ చేశాడు. టీవీలో ఆఫీసుకు సంబంధించిన దృశ్యాలు చూపిస్తున్నారు. దీనిపై సీఎం మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు ప్రకటించారు.
 
భార్య.. ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా మీ పాడు సిగరెట్ అలవాటు మానుకోరు కదూ!