మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (11:23 IST)

యూత్ ఫుల్ సినిమా పేరుతో తీసిన లవ్ మౌళి ఎలా వుందో తెలుసా.. రివ్యూ

Navdeep, Pankoori Gidwani
Navdeep, Pankoori Gidwani
నటీనటులు: నవదీప్‌, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా తదితరులు
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: అజయ్ శివశంకర్, సంగీత దర్శకుడు: గోవింద్‌ వసంత్‌, ఎడిటింగ్: అవనీంద్ర, నిర్మాతలు : సి స్పేస్, దర్శకుడు: అవ‌నీంద్ర
 
తాను ఇప్పటి యూత్ కు తగినట్లు మారి తాను నటించి నిర్మించిన సినిమా లవ్ మౌళి అని ప్రకటించిన నవదీప్ సినిమా ఈరోజే విడుదలైంది. పంకూరి గిద్వానీ, చార్వి దత్తా లను నాయికలుగా ఎంచుకుని  అవ‌నీంద్ర దర్శకత్వం వహించిన చిత్రమిది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
 
కథ:
చిన్న తనం నుంచి ఒంటరిగా వుండే  మౌళి (నవదీప్‌) పెయింటింగ్ ఆర్టిస్ట్. అతనికి వ్యతిరేక ఆలోచనలు వున్న చిత్ర (పంకూరి గిద్వానీ). అలాంటి ఆమెను మౌళి ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కూడా చాలా ఘాడంగా వుంటుంది. కానీ కొద్దికాలానికి చిత్రలో మార్పులు మౌళి గమనిస్తాడు. మౌళి తాననుకున్నదో ప్రేమ అనుకున్నాడా? చిత్ర తాను అనుకున్నదే అసలైన ప్రేమ అనుకున్నదో తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష:
 
ఈ సినిమా కథ రాజు,పేద కాన్సెప్ట్ లా ఒంటరివాడు, అందరు కావాలనుకునే అమ్మాయి మధ్య జరిగే కథ. సింపుల్ కథ. దీనికి నేటి కాలానికి అనుగుణంగా అంటూ దర్శకుడు రొమాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బోల్డ్ మూవీ తీశాడు. ఈ సన్నివేశాల్లో హీరో హీరోయిన్లు జీవించాలరనే చెప్పాలి. కథతో సందేశాలు, సమాజానికి ఉపయోగపడేవి లేకపోయినా ఇప్పటి తరం ఎలా వుందో చెబుతూ, ఎలా వుండకూడదో వారికి వదిలేశాడు.
 
నవదీప్‌ గత సినిమాలవలే చాలా సునాయాసంగా పాత్రను పోషించాడు. అదేవిధంగా హీరోయిన్ గా చాలా సన్నివేశాల్లో మెప్పించింది. నటనాపరంగా ఇద్దరూ అలరించారు. చాలా చోట్ల టైమింగ్, ఎంటర్టైన్మెంట్ బాగా చేశాడు నవదీప్. హీరోయిన్ గా  పంకూరి గిద్వానీ కి మంచి లాంఛింగ్ ఈ సినిమా అవుతుందని చెప్పవచ్చు. పాత్రలోని మూడు వేరియేషన్స్ ను ఆమె బాగా పండించింది. ఇతర నటీనటులు  పాత్ర పరిధి మేరకు నటించారు. 
 
దర్శకుడు అవ‌నీంద్ర రాసుకున్న మెయిన్ థీమ్ పర్వాలేదు. కానీ కథనంలో కొత్తదనం లేకపోగా రొటీన్ గా చాలా చోట్లఅనిపిస్తుంది. యూత్ సినిమా పేరుతో బాగా రొమాన్స్ చూపించాడు. మరికొచోట్ల సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ఒంటరిగా వుండే హీరోకూ, మనుషులతో కలిసే హీరోయిన్ కు మధ్య సాగే డెప్త్ సీన్లు ఇంకా హైలైట్ చేస్తే బాగుండేది. ఇప్పటి జనరేష్ చాలా మంది ఒంటరి బతుకులే. నలుగురితో మాట్లాడాలంటే బయపడుతుంటారు. అాలాంటి కథను తీసుకున్నా మరింత ఆకట్టుకునేలా తీస్తే బాగుండేది.  
 
ఇక పాత్రల మధ్య సన్నివేశాలను మరింత బాగా రాసుకుంటే బాగుండేది. యూత్ అంటే బోల్డ్ సీన్లు చూస్తారనుకుంటే పొరపాటు. కథలో మలుపులు, ఊహించని కథనాలు వుండాలి. అవి ఇందులో లోపించాయి. సాదా సీదా సినిమాగా దర్శకుడు తీశాడు.
 
ఇక సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌, నిమాటోగ్రఫీ రిలీప్ గా వుంది. ఇది కేవల కొంత మందికి నచ్చేవిధంగా వుంది మినహా అందరికీ నచ్చేలా దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. యూత్ పేరుతో వచ్చిన మరో కల్ట్ మూవీ. ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
రేటింగ్ 2/5