శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:20 IST)

శరీరాన్ని పూర్తిగా కప్పుకుని వెళ్లినా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయ్..

''మై ఛానల్ నా ఇష్టం''లో మెగా బ్రదర్ నాగబాబు తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో నాగబాబు మహిళల వస్త్రధారణపై ఈ ఛానల్ ద్వారా కామెంట్ చేశారు. ఈ మధ్య గౌరవనీయులైన కొందరు మహిళల వస్త్రధారణపై మాట్లాడుతున్నారు. సంప్రదాయ వస్త్రాలు ధరించకపోవడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. 
 
మహిళలు శరీరాన్ని పూర్తిగా కప్పి వుంచే దుస్తులు వేయాలని చెప్తున్నారు. అసలు ఆడపిల్లలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించారు. పూర్తిగా శరీరాన్ని కప్పి వుంచే వస్త్రాలను ధరించిన మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా నాగబాబు గుర్తు చేశారు. 
 
ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలనేది ఆడపిల్లల హక్కు .. దానిని కాదనడానికి మీరెవరు? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆడపిల్లలు ఎప్పుడూ ఎక్కడా కూడా మగవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడలేదే. ఎప్పుడండీ మీరు మారతారు? బూజుపట్టిపోయిన సంప్రదాయాలను పట్టుకుని వేలాడుతున్నారనంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. 
 
మహిళలు ఎలా డ్రెస్ వేసుకున్నా.. వారిని వక్ర బుద్ధితో చూసే బుద్ధిని మార్చుకోవాలని.. అంతా కన్వీనియంట్‌గా చూసేసి.. తర్వాత స్టేజ్‌లపై వారి డ్రెస్ గురించి మాట్లాడుతారా?.. మగాళ్లను ఎవరైనా ఆడవాళ్లు డ్రెస్ కోడ్ మీద షరతులు వేశారా..? పొట్టలేసుకుని బనియన్లతో తిరిగినా.. పంచెలు కట్టుకుని జుట్టుతో తిరిగినా.. మహిళలు ఏమాత్రం పట్టించుకోరని.. కానీ ఓ అమ్మాయి డ్రెస్ గురించి ఇంత కామెంట్లు ఎందుకు.. వారి హక్కుపై మీరెవరు మాట్లాడేందుకు అంటూ ప్రశ్నాస్త్రాలు కురిపించారు.