శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : గురువారం, 26 జులై 2018 (17:50 IST)

పోలీసే దొంగగా అవతారమెత్తితే.. ఇలాగే వుంటుంది..

అవునండి.. పోలీసే దొంగగా మారింది. దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ అధికారిణి ఏకంగా దొంగగా అవతారం ఎత్తింది. ఓ సూపర్ మార్కెట్లో వస్తువుల్ని ఎంచకా జేబులో దాచుకుని దొరికిపోయింది. ఈ తతంగాన్ని గమనించి నిలదీసి

అవునండి.. పోలీసే దొంగగా మారింది. దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ అధికారిణి ఏకంగా దొంగగా అవతారం ఎత్తింది. ఓ సూపర్ మార్కెట్లో వస్తువుల్ని ఎంచకా జేబులో దాచుకుని దొరికిపోయింది. ఈ తతంగాన్ని గమనించి నిలదీసిన ఆ సంస్థ ఉద్యోగి వస్తువుల్ని వెనక్కు ఇవ్వాలని కోరడంతో కోపంతో రెచ్చిపోయిన ఆమె తన భర్తతో చావగొట్టించింది. ఈ ఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. 
 
సూపర్ మార్కెట్లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఫోనులో మాట్లాడుతూ.. వస్తువులను తన జేబులో పెట్టింది. దీన్ని ఆ షాపు ఉద్యోగి ప్రణవ్ గమనించాడు. వెంటనే ఆమె వద్దకెళ్లి ఆ వస్తువులను తిరిగి ఇవ్వాలన్నాడు. అంతేకాకుండా తప్పు చేసినట్టు క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలన్నాడు. అంతే కోపం ఊగిపోయిన మహిళా పోలీసు భర్తకు ఈ విషయం చెప్పి.. తనతో పాటు మరికొందరని పట్టుకొచ్చి.. సూపర్ మార్కెట్‌పై దాడి చేయించింది. ప్రణవ్‌పై కూడా దాడి చేయించింది. ఈ ఘటనలో ప్రణవ్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.