మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (16:51 IST)

వైఎస్సార్సీపీ పక్కా ప్లానింగ్- ఊరు మారింది.. షార్ట్ ఫిల్మ్ రిలీజ్

Vooru Marindi
Vooru Marindi
ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ఆర్సీపీ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. తాజాగా ఎన్నికల డిజిటల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక.. గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న అభివృద్ధిని చిత్రీకరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ ఇది. ఊరు మారింది అని దీనికి పేరు పెట్టారు. 
 
నాడు-నేడు కింద గ్రామాల్లో నిర్మించిన పాఠశాలలు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్‌ పరిజ్ఞానంతో విద్యను బోధించడం వంటివి ఇందులో చిత్రీకరించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 
 
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చడం, విలేజ్ క్లినిక్స్, గ్రామీణ సచివాలయాలు, ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ.. వంటి అంశాలన్నింటినీ ఇందులో పొందుపర్చారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు మల్లగుల్లాలు పడుతోండగా.. వైసీపీ మాత్రం ఈ రెండింటినీ ఏకకాలంలో పూర్తి చేస్తోంది.