గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (11:29 IST)

వైకాపా పాలనకు మూడేళ్లు.. ప్రజా వేదిక విధ్వంసంతో మొదలు

Jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేటికి మూడేళ్లు కావొస్తుంది. ఈ కాలంలో తమ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహించిందని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. 
 
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ తన సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల పాలనపూర్తి చేసుకుంటున్న తరుణంలో మూడేళ్ళ పాలనపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 95 శాం హామీలను అమలు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తామని ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, వైకాపా ప్రభుత్వ మూడేళ్ళ పాలన విధ్వంసంగా సాగుతోందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన గత మూడేళ్ళలో విధ్వంసం, రివర్స్ డెవలప్‌మెంట్, దాడులు, ఎస్సీఎస్టీ అక్రమ కేసులు బనాయింపు, విపక్ష నేతలపై దాడులు, కేసులు, అరెస్టులు వంటి చర్యలతో విజయవంతంగా సాగుతోందని ఆయన అన్నారు.