బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (08:31 IST)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయానికి మూడేళ్లు

ysrcpjagan
గత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగా, ఏకంగా 151 సీట్లలో ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ శాసనసభలో తిరుగులేని మెజార్టీతో అడుగుపెట్టింది. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రజా విజయాని నేటికి సరిగ్గా మూడేళ్లు. గత 2019 మే 23వ తేదీన ఈ ప్రజా విజయం దక్కింది. 
 
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్. జగన్ కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి సొంత పార్టీని స్థాపించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. అనేక అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్ 17 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో పార్టీని జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిళను నడిపించారు. 
 
జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా 2019లో జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి వైకాపాకు ప్రజలు పట్టంకట్టారు. అలా వైకాపా ప్రజా విజయాన్ని సొంతం చేసుకుని నేటికి మూడేళ్లు పూర్తికానుంది.