గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఎస్ఎస్ రాజమౌళి టార్చర్ భరించలేను.. ఆత్మహత్య చేసుకుంటా : క్లోజ్ ఫ్రెండ్ వీడియో

rajamouli
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై ఆయన చిరకాల స్నేహితుడు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నానని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సెల్ఫీ వీడియోతో పాటు లేఖను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఎస్ఎస్ రాజమౌళి స్నేహితుడు యు.శ్రీనివాస రావు. వీరిద్దరి మధ్య గత 34 యేళ్ళుగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. పైగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. అలాంటి శ్రీనివాసరావు ఇపుడు రాజమౌళి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. 
 
ఈ సెల్ఫీ వీడియోను, లేఖను రాజమౌళి స్నేహితులకు శ్రీనివాసరావు పంపించారు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమౌళికి లై డికెక్టర్ టెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.