ప్రేమించిన అమ్మాయి కాదు పొమ్మంది.. తల్లి అడ్డొచ్చింది.. కత్తితో దాడి ఎక్కడ?
ప్రేమ కోసం కొందరు యువకులు మృగాళ్లుగా మారిపోతున్నారు. తాము కోరుకున్న అమ్మాయి కాదని చెప్పిందంటే.. వాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారు. కత్తులతో పాటు యాసిడ్‌లతో దాడికి దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా మందమర్రికి చెందిన మర్రి రామకృష్ణ ప్రేమించిన అమ్మాయి తనను కాదు పొమ్మంది.
తానంటే ఇష్టంలేదని చెప్పిన అమ్మాయి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. ఆమె తల్లి అడ్డు రావడంతో ఆమెపై సైతం కత్తితో దాడిచేశాడు. బాధితురాలి అమ్మమ్మ రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.