1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: గురువారం, 19 మే 2016 (14:47 IST)

కుటుంబ కలహాలతో అరణియార్‌ ప్రాజెక్టులో దూకి మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో చిత్తూరుజిల్లాలో ఒక మహిళ అరణియార్‌ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పిచ్చాటూరులోని టీచర్స్ కాలనీకి చెందిన సురేష్‌ భార్య మోహనమ్మ(40) కుటుంబ సమస్యలతో గత మూడురోజులకు ముందు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మూడురోజులు కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తూనే ఉన్నాయి.

అయితే గురువారం తెల్లవారుజామున అరణియార్‌ ప్రాజెక్టు వద్ద ఒక మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు సమాచారం అందించారు. మృతదేహం మోహనమ్మదేనని బంధువులు నిర్ధారణకు వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు పోలీసులు తెలిపారు.