సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (10:45 IST)

డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ (video)

Pawan kalyan
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను నటుడు, డైరెక్టర్ రాధాకృష్ణన్ పార్థిబన్ ఆదివారం కలిశారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 
 
ఈ సందర్భంగా పార్థిబన్‌ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. జ్ఞాపికలు బహూకరించారు. పార్థిబన్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జ్ఞాపిక అందించారు. అలాగే ఓ పుస్తకాన్ని కూడా బహూకరించారు. 
 
నటుడుతో పాటుగా డైరెక్టర్ కూడా అయిన పార్థిబన్ 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలిశారా అనేది ఆసక్తికరంగా మారింది.