గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 26 జూన్ 2017 (17:49 IST)

అఖిలప్రియ సవాల్... ఆమె మంత్రి పదవికి గుదిబండగా మారుతుందా?

రాజకీయాలంటే వైకుంఠపాళి అని చాలామంది అంటుంటారు. రాజకీయాల్లో వున్నవారు అంత తేలిగ్గా మాటలతో దొరక్కూడదు. ఎంతమంది రెచ్చగొట్టినా ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడా దొరక్కూడదు. తమదే తప్పయినా తమదేమీ తప్పు లేదని వాదించే సత్తా వుండాలి. ప్రజలకు మేలు చేయకపోయినా చాలా చేస

రాజకీయాలంటే వైకుంఠపాళి అని చాలామంది అంటుంటారు. రాజకీయాల్లో వున్నవారు అంత తేలిగ్గా మాటలతో దొరక్కూడదు. ఎంతమంది రెచ్చగొట్టినా ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడా దొరక్కూడదు. తమదే తప్పయినా తమదేమీ తప్పు లేదని వాదించే సత్తా వుండాలి. ప్రజలకు మేలు చేయకపోయినా చాలా చేసేస్తున్నాననీ, ప్రజల కోసమే బతుకుతున్నాననీ... ఇలా చాలా వుంటాయి రాజకీయాల్లో. అలా మాట్లాడకపోతే తేడాలు వచ్చేస్తాయి. సమీకరణాలు మారిపోయి పదవులకే ముప్పు రావచ్చు. కాబట్టి రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. 
 
తాజాగా మంత్రి అఖిలప్రియ ఓ సవాల్ విసిరి సమస్యల్లో ఇరుక్కున్నారన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రాజకీయాల్లో బాగా పండిన వ్యక్తి కాదు. ఉన్నది వున్నట్లుగా కుండబద్ధలు కొట్టడమే ఆమెకు తెలిసింది. ఇంకా రాజకీయాల్లో పండిపోలేదు. అందువల్ల తాజాగా ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ... నంద్యాలలో తమ అభ్యర్థి ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని సవాల్ విసిరారు. 
 
సరే... గెలిస్తే ఫర్వాలేదు. ఓడిపోతే నిజంగా రాజీనామా చేసేస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే చాలామంది నాయకులు చెప్పిన మాట మీద నిలబడరు. మరి అలాంటిది అఖిలప్రియ పార్టీ అభ్యర్థి గెలిస్తే సవాలుతో పనిలేదు... ఓడితే మాత్రం చాలా పని వుంది. చూడాలి ఏం జరుగుతుందో?