శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (08:46 IST)

మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం.. చంద్రబాబు దిగ్భ్రాంతి... హరీష్ రావు నివాళులు

హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏ

హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నిషిత్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రి నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ మృతి పట్ల కేంద్రమంత్రి సుజనా చౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రి కామినేని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం నిశిత్ కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
మరోవైపు... మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి వార్త తెలిసిన వెంటనే బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం అక్కడ నిషిత్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారు నిశిత్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.