శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (12:35 IST)

పెళ్లాం పక్కలో పడుకునివున్నా .. మందు బాటిలే గుర్తుకొస్తుంది : ఓ తాగుబోతు

ఓ తాగుబోతు తన ఆవేదనను వ్యక్తంచేశాడు. పెళ్లాం పక్కలో పడుకునివున్నా మద్యం బాటిలే గుర్తుకు వస్తుందని వాపోయాడు. విజయవాడకు చెందిన ఓ తాగుబోతు ఈ వ్యాఖ్యలు చేశాడు. కేంద్రం ఇచ్చిన సడలింపుల మేరకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే, విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ తాగుబాతు మద్యం దుకాణానికి వచ్చి... అది ఓపెన్ చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఇక్కడ మద్యం దుకాణం తెరవలేదు. దీనికి కారణం, అది రెడ్ జోన్ కావడంతో ఇక్కడ మద్యం షాపు తెరవలేదు. దీనిపై ఆ తాగుబోతు పైవిధంగా స్పందించాడు. మరోవైపు, పలు ప్రాంతాల్లో మద్యం షాపుల మందు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 
 
కిలోమీటరు మేరకు మందుబాబు క్యూ 
కేంద్రం సడలించిన ఆంక్షల మేరకు.. దేశంలోని గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందు బాబులు మద్యం బాటిళ్ళను కొనుగోలు చేసేందుకు కిలోమీటరు కొద్ది బారులు తీరారు. అయితే, అనేక ప్రాంతాల్లో మందు బాబులు నానా హంగమా సృష్టిస్తున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మందు షాపు ముందు ఉద్రిక్తత నెలకొంది. పెరిగిన మద్యం ధరలు సీసాలపై అప్‌డేట్‌ కావపోవడంతో మందుబాబులకు మందు అందడంలో ఆలస్యం జరుగుతోంది.
 
ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూ కట్టిన మందుబాబుల్లో ఓపిక నశిస్తోంది. వరుసలో నిలబడాలని పోలీసులు ఎంతగా చెబుతున్నా వారు వినిపించుకోవట్లేదు. మాస్కులు, భౌతిక దూరం పాటించట్లేదు. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు బారులు తీరిన వందలాంది మందిని పోలీసులు చెదరగొట్టారు.
 
అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. విజయనగరంలో ఉదయం నుంచి మద్యం కాణాల వద్దే మందుబాబులు వేచి చూస్తున్నారు. మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. పాత ధరల నుండి కొత్త ధరలు మార్చటంలో సాంకేతిక లోపం తలెత్తిందని విజయనగరంలోని పలు షాపు యజమానులు మీడియాకు చెప్పారు. దీంతో మద్యం షాపులు ఇంకా తెరవలేదని తెలిపారు. విశాఖపట్నంలో మద్యం దుకాణాల ముందు విపరీతంగా రద్దీ ఉంది.
 
కాగా, సోమవారం ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మందుబాబులు వందలాది మంది మద్యం దుకాణాలకు చేరుకోవడంతో వారిని అదుపు చేయలేక, మద్యం దుకాణాల సిబ్బంది, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను విధించినప్పటికీ చాలా ప్రాంతాల్లో వాటిని మందుబాబు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు.