బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2023 (21:36 IST)

విజయనగరం జిల్లాలో ఘోరం .. ఢీకొన్న రెండు రైళ్లు - ఆరుగురు మృతి

trains accidents
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. ఈ జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. రాయగడ ప్యాసింజర్‌ రైలును వెనుక నుంచి పలాస ప్యాసింజర్‌ ఢీకొట్టింది. సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  దీంతో విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది తెలిపింది. పట్టాలు క్రాస్‌ చేస్తుండగా ఒక ట్రైన్‌ను మరో రైలు ఢీకొంది. విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమైంది. కొత్తవలస మండలం అలమండ - కంటకాపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ‌, జిల్లా కలెక్టర్, ఎస్సీని సంఘటన స్థలానికి హుటాహుటిన పంపించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.