ఏపీ వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ సూచనలు
ఏపీ వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా, అమృతసర్ గుండా వెళుతుంది. దీంతో రాగల 6 నుంచి 7 రోజులలో వాతావరణంలో మార్పులు ఉంటాయి.
దక్షిణ ఒడిశా ఉపరితల ఆవర్తనము సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల ఏపీలో రాగల మూడు రోజుల్లో వాతావరణం ఇలా ఉండనుంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈరోజు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.