ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (08:50 IST)

మాచర్ల మున్సిపాలిటీలో ఖాళీ అవుతున్న వైకాపా...

ysrcp flag
పల్నాడు జిల్లాలోని మాచర్ల నగర పాలక సంస్థలో గత ఐదేళ్ళుగా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన వైకాపాకు ఇపుడు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది వైకాపా కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. తాజాగా మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు, వైస్ చైర్మన్ నరసింహా రావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. గురువారం స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో వీరిద్దరూ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 
 
కాగా, మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉండగా గత 2022లో జరిగిన ఎన్నికల్లో అన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో వైకాపా సొంతం చేసుకుంది. అధికారం తమ చేతుల్లో ఉండటంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి నామినేషన్లు దాఖలు చేయకుండా చేసి ఏకగ్రీవాలు చేయించుకుంది. ముఖ్యంగా, అపుడు ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిల సారథ్యంలో మాచర్లలో రౌడీ రాజ్యం సాగింది. 
 
కానీ, ఇపుడు వైకాపా స్థానంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో మాచర్ల రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వైకాపా నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. దీంతో 14 మంది వైకాపా కౌన్సిలర్లు టీడీపీలో చేరగా, ఇపుడు చైర్మన్, వైఎస్ చైర్మన్‌లు కూడా చేరిన పక్షంలో మాచర్ల మున్సిపాలిటీలో టీడీపీ బలం 16కు చేరుతుంది. ఆ తర్వాతకూడా మరికొందరు వైకాపా కౌన్సిలర్లు టీడీపీ, జనసేన, బీజేపీలలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.