శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (19:33 IST)

ఇసుకను ఉచితంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు... చంద్రబాబు కీలక నిర్ణయం

Chandra babu
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత ఇసుక విధానం మరో అడుగు ముందుకేస్తూ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం. 
 
రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఉచిత ఇసక పాలసీని మరింత సులభతరం చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక బుకింగ్‌, ట్రాన్స్‌పోర్ట్, నిఘా వంటి అంశాలపై ఆరా దీసిన ఆయన.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్ర ప్రజలు ఇసుకను సులభంగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుకను ఉచితంగా బుకింగ్ చేసిన తర్వాత ఎప్పుడు రవాణా అవుతుంది? అనే విషయం నేరుగా వినియోగదారులకే తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.