బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (22:27 IST)

ఇద్దరు మహిళా రోగులపై వైద్యుడి అఘాయిత్యం... ఎక్కడ?

ఎకోకార్డియోగ్రామ్ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు మహిళా రోగులపై ఆస్పత్రిలోనే ఓ కామాంధ వైద్యుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో వెలుగు చూసింది. రోగుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఎస్సీబీ మెడికల్ కాలేజీ అడం ఆస్పత్రి ఉంది. ఇక్కడికి ఇద్దరు మహిళా రోగులు ఎకోకార్డియోగ్రామ్ వైద్య పరీక్షల కోసం ఆదివారం వచ్చారు. వీరికి వైద్య పరీక్షల నిమిత్తం గదికి తీసుకెళ్లిన ఓ రెసిడెంట్ వైద్యుడు అఘాయిత్యానికి పాలపడ్డాడు. దీనిపై బాధిత మహిళలు ఇద్దరూ మంగలాబాద్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసినట్టు కటక్ అడిషినల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారని తెలిపారు. కాగా, నిందిత వైద్యుడిని రోగుల బంధువులు చితకబాదారని, అయితే, వైద్యుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అనిల్ మిశ్రా వెల్లడించారు.